New Labour Codes India | పాత కార్మిక చట్టాల వల్ల లాభం లేదు..కొత్త లేబర్ కోడ్స్‌ అమల్లోకి 

New Labour Codes implemented across India for worker welfare New Labour Codes implemented across India for worker welfare

India Labour Reforms 2025:కాలంతో మారని చట్టాల వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు అనే భావనతో కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాల(old labour codes india)కు బదులుగా ఆధునిక లేబర్ కోడ్స్‌(new labour codes india)ను తీసుకువచ్చింది.

స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్న కార్మిక నియమాలు నేటి ఉపాధి వ్యవస్థలకు సరిపోకపోవడంతో, కొత్త ఉద్యోగ విధానాలు, గిగ్ వర్క్, కాంట్రాక్ట్ జాబ్స్, ఐటీ రంగం వంటి విభిన్న రంగాల్లో పనిచేసేవారి సంక్షేమం చట్టపరంగా బలపడాల్సిన అవసరం ఏర్పడింది.

ALSO READ:Trump Ukraine Peace Plan | పీస్ ప్లాన్‌కు జెలెన్‌స్కీ ఒప్పుకోవాల్సిందే: ట్రంప్ 


శుక్రవారం నుంచి దేశంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయి. మొత్తం 29 పాత చట్టాలను రద్దు చేసి, వాటిని ఒకే సమగ్ర వ్యవస్థగా మార్చారు. కోడ్ ఆన్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కోడ్‌లతో ఉద్యోగులకు మెరుగైన భద్రత, సమాన అవకాశాలు, టైమ్లీ పేమెంట్, ఏకీకృత కనీస వేతనం వంటి అంశాలు బలోపేతం అవుతున్నాయి.

మొత్తం వేతనంలో 50% ను ‘వేజ్’గా పరిగణించడం వల్ల PF, గ్రాచ్యుటీ, మెటర్నిటీ బెనిఫిట్స్ పెరుగుతాయి.

ముఖ్యంగా గిగ్ వర్కర్లకు(gig workers), మైగ్రెంట్ లేబర్‌(Migrant labours)కు ఇది భారీ మద్దతుగా భావిస్తున్నారు. 2030 నాటికి 23.5 మిలియన్ల గిగ్ వర్కర్లు ప్రయోజనం పొందుతారని అంచనా.

అయితే గతంలో చట్టాలు ఉన్నా అమలు లోపాల కారణంగా కార్మికులు నష్టపోయారని విమర్శలు ఉన్నాయి. కొత్త కోడ్స్ ప్రభావం కనిపించాలంటే ప్రభుత్వ యంత్రాంగం వాటిని కఠినంగా అమలు చేయడం అత్యంత కీలకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *