Nellore Bus Accident: నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు(Pellakuru) మండలం సమీపంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్(Morning Star Travels)కు చెందిన బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ALSO READ:INDIA Alliance | బిహార్ ఓటమి తర్వాత ఇండీ కూటమి బలోపేతం
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
సంఘటన స్థలం వీడియో బయటకు వచ్చిన తర్వాత ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. వేగం అతిగా ఉండటం కారణమై ఉండవచ్చని ప్రాథమిక అంచనా.
