Sabarmati Jail Attack | గుజరాత్ సబర్మతి జైలులో హైదరాబాద్‌ ఉగ్రవాది పై తోటి ఖైదీల దాడి

Gujarat inmates attack Hyderabad terror suspect Ahmed inside Sabarmati Jail Gujarat inmates attack Hyderabad terror suspect Ahmed inside Sabarmati Jail

హైదరాబాద్‌కు చెందిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాది అహ్మద్ పై గుజరాత్ సబర్మతి జైలు(Sabarmati Jail Attack )లో తోటి ఖైదీలు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల గుజరాత్(Gujarat) ఏటీఎస్ అతడిని అరెస్ట్ చేసిన తర్వాత అతడిని హై-సెక్యూరిటీ సెల్‌లో ఉంచినప్పటికీ, అకస్మాత్తుగా వచ్చిన కొంతమంది ఖైదీలు అతడిని తీవ్రంగా కొట్టినట్లు అధికారులు తెలిపారు.

ఖైదీల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో, పోలీసులు జోక్యం చేసుకుని అహ్మద్‌ను రక్షించారు.అహ్మద్‌ ఐఎస్కేపీ ఉగ్రవాదితో టచ్‌లో ఉండి, ఆదేశాల మేరకు విషం తయారు చేయడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో బయటపడింది.

ఆముదం గింజల నుంచి ప్రాణాంతకమైన రైసిన్ విషాన్ని తయారు చేసి, దాన్ని ప్రసాదంలో కలిపి అమాయకుల ప్రాణాలు తీయాలని పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసు నేపథ్యంలో ఇప్పటికే గుజరాత్ ఏటీఎస్‌ ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. సబర్మతి జైలులో అహ్మద్‌పై దాడి ఎందుకు జరిగిందనే అంశంపై అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

ALSO READ:Elon Musk White House Dinner:వైట్‌హౌస్ విందుకు ఎలాన్ మస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *