Gig Workers Act 2025:గిగ్ వర్కర్లకు మంచి శుభవార్త త్వరలో రూపుదిద్దుకోనున్న కొత్త చట్టం.ఇక వివరాల్లోకి వెళితే…తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గిగ్ వర్కర్ల(Gig Workers) సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. మొబిలిటీ, ఫుడ్ డెలివరీ(food delivery boys), లాజిస్టిక్స్, ఈ-కామర్స్ రంగాల్లో పనిచేసే యువతతో పాటు ఇళ్లలో పని చేసే వారిని కూడా గిగ్ వర్కర్ల కేటగిరీలో చేర్చారు.
సామాజిక భరోసా లేకుండా కీలక యాప్ సేవలను నడిపిస్తున్న వీరికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం “Telangana Platform-Based Gig Workers Registration, Social Security and Welfare Act 2025” బిల్లును సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికులు ఉన్నట్టు అంచనా. వీరికి సెలవులు, నిర్దిష్ట పని గంటలు, చెల్లింపులపైనా స్పష్టత లేని పరిస్థితి నెలకొన్నది.
గిగ్ వర్కర్ల సమస్యలను తెలుసుకోవడానికి ప్రభుత్వం పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గిగ్ వర్కర్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చట్టం అమల్లోకి వస్తే గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, బీమా, సామాజిక భద్రత, హక్కుల రక్షణ లభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కొత్తగా ఏర్పడనున్న బోర్డు రిజిస్ట్రేషన్ మరియు సంక్షేమ చర్యలను పర్యవేక్షిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలు పెద్దగా విజయం సాధించకపోయినా, తెలంగాణ నిజాయితీగా అమలు చేస్తే లక్షల మంది జీవితాలకు భరోసా అందనుంది.
ALSO READ:Two Child Norm Policy Removed: తెలంగాణలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
