Saudi Bus Accident: HYD Family Tragedy – ఒకే కుటుంబంలో 18 మంది మృతి 

Hyderabad family members who died in the Saudi Arabia bus accident Hyderabad family members who died in the Saudi Arabia bus accident

ఒకే కుటుంబంలో 18 మందిచనిపోవడం కలకలం రేపుతోంది.సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్‌(Saudi Bus Accident) రాంనగర్‌ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాంనగర్‌కు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మరణించారు.

ఉమ్రా యాత్రకు కుటుంబ సభ్యులందరినీ తీసుకుని సౌదీకి వెళ్లిన నసీరుద్దీన్‌తో పాటు అతని సన్నిహితులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్‌ వాసులే కావడంతో ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది.

ALSO READ:iBomma Final Message: క్షమించండి iBomma ని శాశ్వతంగా మూసివేస్తున్నాం 


దుర్ఘటన జరిగిన విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ కుటుంబంలో ఇప్పుడు ఒక్కరే మిగిలారని సమాచారం. నసీరుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నాడు. అతడే ప్రస్తుతం ఆ కుటుంబానికి ఏకైక సభ్యుడిగా మిగిలిపోయాడని వారి బంధువులు వెల్లడించారు.

సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *