ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు.ఏ మధ్యకాలంలోనే చాలా ప్రమాదాలు జరిగాయి .తాజాగా మళ్ళీ సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం(Saudi Bus Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన 42 మంది యాత్రికులు మృతిచెందినట్లు సమాచారం.
మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ టాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దహనమైంది. బస్సులో ఉన్న భారతీయులు బయటకు రాలేక సజీవ దహనమయ్యారు.
ALSO READ:Mithali Thakur:బీహార్ యువ ఎమ్మెల్యే మిథాలీ ఠాకూర్
మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన వారేనని ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉండటం విషాదాన్ని మరింత పెంచింది.
ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు మంటలను ఆర్పి శరీరాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ ప్రమాదంపై భారత రాయబారి కార్యాలయం సౌదీ అధికారులతో సమన్వయం చేస్తోంది. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే చర్యలు కొనసాగుతున్నాయి.
