Drone camera Chase:మహారాష్ట్రలోని అమరావతిలో పెళ్లి జారుతున్న సమయంలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లికొడుకు సుజల్ రామ్ సముద్రపై జితేంద్ర అనే వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించాడు. ఈ దాడి పెళ్లి వేడుకలో పాల్గొన్న వారిని భయాందోళనలకు గురిచేసింది.
సమాచారం ప్రకారం, పెళ్లి వేడుకలో డీజే డాన్స్ సమయంలో జరిగిన వాగ్వాదమే ఈ దాడికి దారితీసినట్లు తెలుస్తోంది.

దాడి అనంతరం నిందితుడు బైక్‌పై పరారయ్యాడు. అయితే, అక్కడి ఫోటోగ్రాఫర్ చాకచక్యంగా స్పందించి తన డ్రోన్ కెమెరా(Drone Camera) సహాయంతో నిందితుడిని సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంబడించాడు.
ALSO READ:Hyderabad dog bites:హైదరాబాద్లో కుక్కల బెడద..మూడు నెలల్లో ఎన్ని కేసులు అంటే!
ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పెళ్లికొడుకును స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
