హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట సమీపంలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1629 వద్ద గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుల గ్యాంగ్ రచ్చకెక్కింది.

మత్తు ప్రభావంలో తూలుతూ నానా హంగామా సృష్టించిన వారు రోడ్డుపై నిలిపి ఉన్న ప్రైవేట్ బస్సుపై దాడి చేశారు. కర్రలతో బస్సు గాజు తలుపులు, కిటికీలను పగలగొట్టారు. ఈ దాడిని స్థానికులు చూస్తూ వీడియోలు రికార్డు చేసుకున్నారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.
also read:Palnadu Bus Accident: పల్నాడు జిల్లా లో ప్రైవేట్ బస్సుకు తప్పిన ప్రమాదం
ఆ సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బంది కూడా లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పటాన్‌చెరు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న ఆ బస్సు డ్రైవర్ యూ-టర్న్ తీసుకునే సమయంలో తమ కారును ఢీకొట్టాడని గ్యాంగ్ వాదించింది. ఆ తర్వాత బస్సు డ్రైవర్‌పై కూడా దాడి చేశారు.
ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి, దాడి చేసిన గ్యాంగ్‌పై కేసు నమోదు చేశారు.
యువతలో పెరుగుతున్న మత్తు వ్యసనంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
