జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: కేరన్‌ సెక్టార్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

మ్మూకాశ్మీర్ కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న భారత సైన్యం

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలమైంది. కుప్వారా జిల్లాలోని కేరన్‌ సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

పక్కా నిఘా సమాచారం ఆధారంగా నవంబర్‌ 7న సైన్యం ఆపరేషన్‌ ప్రారంభించింది. మొదటగా భద్రతా దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించగా, వెంటనే ప్రతిస్పందించి కాల్పులు ప్రారంభించాయి.

ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది ఇంకా నక్కి ఉండొచ్చని సైన్యం అనుమానిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది.

ALSO READ:రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

గత కొద్ది నెలలుగా జమ్మూకాశ్మీర్‌లో సైన్యం నిఘా చర్యలను బలపరుస్తోంది. ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం సైన్యం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

అనంతరం మే 7న భారత సైన్యం “ఆపరేషన్‌ సిందూర్‌” పేరుతో పాకిస్థాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ప్రతిదాడులు జరిపి 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు జరగకుండా సైన్యం అప్రమత్తంగా గస్తీ కాస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *