కొనప్ప బీఎంఎస్ గూటికి తిరిగొచ్చారు: కేటీఆర్, హరీశ్ రావు కండువా కప్పి ఆహ్వానం కాంగ్రెస్‌కు సిర్పూర్‌లో ఊహించని ఎదురుదెబ్బ


తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ, సిర్పూర్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమిపాలైన కోనేరు కోనప్ప, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈరోజు (సెప్టెంబర్ 26, 2025) ఎర్రవెల్లిలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు మరియు జగదీష్ రెడ్డి సమక్షంలో కోనేరు కోనప్పకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి బలం కలిగించే అంశమని, పార్టీ నేతలు పేర్కొన్నారు.

కోనప్ప గతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఆయనకు మంచి ప్రజాధారణ ఉంది. అయితే 2023లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగా మారారు. ఆ సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరడం, అంతర్గత పరిణామాల ప్రభావంతో కోనప్ప అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో ఉన్నపటికీ, ఇటీవలి కాలంలో కోనప్ప వరుసగా కేసీఆర్ నాయకత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం, తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే ఊహాగానాలకు ఊతమిచ్చింది.

ఇక ఇప్పుడు ఆ ఊహాగానాలన్నీ నిజమయ్యాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కోనప్ప, వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ తరపున మరలా ప్రతిష్టాత్మకంగా నిలబెట్టే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల అంచనా ప్రకారం, ఆయన తిరిగి బీఆర్ఎస్‌లో చేరడం ద్వారా స్థానికంగా పార్టీకి గిరి పెరుగుతుందని విశ్వాసం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది పెద్ద దెబ్బ. ఇప్పటికే నాయకత్వ లోపం, అంతర్గత వివాదాలతో బాధపడుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌కు కోనప్ప తిరిగి బీఆర్ఎస్‌లో చేరడం మరో రాజకీయ పునర్వ్యవస్థీకరణకు దారి తీసే అవకాశముంది.

ఇటువంటి పరిణామాల మధ్య, రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగే సూచనలున్నాయి. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల కోసం మళ్లీ తన పాత నాయకులను గుంపుగా చేర్చుకుంటూ పార్టీ మైనస్‌ను కవర్ చేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. కోనప్ప ప్రవేశం దానికే నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *