అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం, శేషాచలం అడవుల్లో మరోసారి ‘పుష్ప’ సినిమా సీన్ మాదిరి ఉత్కంఠ నెలకొంది. ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. ఘటనలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి తమిళనాడుకు చెందిన గోవిందన్ అనే స్మగ్లర్ను అరెస్టు చేశారు. పోలీసులు దాడిలో రూ. 80 లక్షల విలువైన 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, దాదాపు 10 మంది స్మగ్లర్లు అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో కత్తులు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు.
శేషాచలం అటవీప్రాంతంలో ‘పుష్ప’ సీన్
