అమర్‌నాథ్ యాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో యాత్రికుల కాన్వాయ్‌లో భాగంగా వెళ్తున్న ఐదు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో 36 మంది యాత్రికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.ప్రమాదానికి కారణం వర్షం వల్ల రోడ్డుపై స్లిప్పరైన పరిస్థితులే కావచ్చని అనుమానిస్తున్నారు. యాత్రికుల పరిస్థితిని పరిశీలిస్తున్నామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు పేర్కొన్నారు. అమర్‌నాథ్ యాత్రలో భద్రత చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హామీ ఇచ్చారు.
అమర్‌నాథ్ యాత్రలో రోడ్డు ప్రమాదం
ఐదు బస్సులు ఢీ, 36 మంది యాత్రికులకు గాయాలు
