ఉచితంగా సాగుతున్న యూపీఐ సేవలకు త్వరలోనే గీతలు పడే అవకాశముంది.₹3వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోంది.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇప్పటి వరకు యూపీఐ సేవలను ఉచితంగా అందిస్తూ వచ్చిన ప్రభుత్వం,ఇప్పుడు బ్యాంకులకు భారం తగ్గించేందుకు ఓ కీలక ప్రతిపాదనపై చర్చిస్తోంది.₹3,000 దాటిన యూపీఐ ట్రాన్సాక్షన్‌కి స్వల్ప ఛార్జీ ఉండవచ్చు. చిన్న మొత్తాలపై ఛార్జీలు ఉండవు.ఈ ప్రతిపాదన అమలైతే, వినియోగదారులపై భారం పెరగడం ఖాయం.కాగా, దీనిపై ఇంకా ప్రభుత్వ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి.వాణిజ్య, బ్యాంకింగ్ రంగాల ప్రతినిధుల అభిప్రాయాల అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.చిన్నమొత్తాల చెల్లింపులకు ప్రస్తుతంలా ఉచితమేనన్నా,వెయ్యుల్లో ట్రాన్సాక్షన్లు చేసే వినియోగదారులకు ఇది కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.మార్పులపై మరింత స్పష్టత కోసం కేంద్ర ప్రకటన కోసం వేచి చూడాలి.