‘అఖండ 2’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆడియో రికార్డింగ్ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆడియోలో నందమూరి బాలకృష్ణ ఒక అభిమానితో ‘అఖండ 2’ టీజర్ గురించి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ ‘అఖండ 2’ గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే, బాలయ్యకు సంబంధించిన ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకొచ్చి అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ రికార్డింగ్‌లో బాలయ్య ఒక అభిమానితో ‘అఖండ 2’ టీజర్ విడుదల గురించి మాట్లాడుతున్నట్లు స్పష్టంగా వినిపిస్తుంది.సార్! మీ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాం సార్. ‘అఖండ’ సృష్టించిన ప్రభంజనం మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడు ‘అఖండ 2’ అంటే ఇంక మా ఆనందానికి అవధుల్లేవు సార్. టీజర్ ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్ అని అడగగా. ఏంట్రా బాబూ, అఖండ 2 టీజర్ గురించి అంత అడుగుతున్నారు? ఏంటి అంత ఆత్రం? అని బాలయ్య నవ్వుతూ అన్నారు.
‘అఖండ 2’ టీజర్ లీక్: అభిమానితో బాలయ్య ఫోన్ కాల్ వైరల్!
