టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ తొలిసారిగా భారత పర్యటనకు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా దేశ అభివృద్ధిపై, సంస్కృతి మీద, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఎరాల్ మస్క్ మాట్లాడుతూ, భారతదేశం ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచానికి ఒక మార్గదర్శిగా మారుతోంది. మోదీ నాయకత్వం బలమైనది, దూరదృష్టి కలిగినది, అని పేర్కొన్నారు.అంతేకాదు భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసిస్తూ, ప్రపంచమంతా శివుడిని అనుసరిస్తే బాగుంటుంది అంటూ ప్రత్యేకంగా శివ తత్వాన్ని గురించి పేర్కొన్నారు. “ఆధ్యాత్మికత, సమతా భావన, శాంతి కోసం శివుని తత్వం అనుసరించడం అత్యవసరం” అని ఆయన అభిప్రాయపడ్డారు.భారతదేశ పర్యటనలో ఎరాల్ మస్క్ పలు ఆలయాలను సందర్శించినట్టు సమాచారం. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. టెక్నాలజీ, ఆధ్యాత్మికత, నాయకత్వం అన్నింటిపై ఒక్కటే వేదికగా మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
viral news : “ప్రపంచమంతా శివుడిని అనుసరిస్తే బాగుంటుంది”: ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్
