IPL 2025 గ్రాండ్ ఫినాలే : అమరజవాన్లకు గౌరవం

IPL 2025 గ్రాండ్ ఫినాలే : అమరజవాన్లకు గౌరవం IPL 2025 గ్రాండ్ ఫినాలే : అమరజవాన్లకు గౌరవం

IPL 2025 గ్రాండ్ ఫినాలే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ముగింపు వేడుకలు జరగనున్నాయి. కానీ ఈసారి మామూలు గ్లామర్ కాదు, గౌరవానికి, దేశభక్తికి ప్రాధాన్యం ఇస్తున్నారు.భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) “ఆపరేషన్ సిందూర్” విజయవంతం చేసిన భారత సాయుధ దళాలను గౌరవించేందుకు ప్రత్యేకంగా అమర జవాన్లకు నివాళి అర్పించనుంది. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీరులకు ఈ వేదికపై ఓ ప్రత్యేక ఘనత లభించనుంది.మరోవైపు, ఈ సీజన్‌ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య అమీతుమీ తలపోర జరగనుంది. ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ అందుకోని ఈ రెండు జట్లు తమ తొలి టైటిల్ కోసం కసిగా తలపడనున్నాయి.ముఖ్యంగా త్రివర్ణ పతాకం, సైనిక గౌరవాల మధ్య జరిగే ముగింపు వేడుకలు ఈ ఫైనల్‌ను మరింత జ్ఞాపకంగా మారుస్తాయని అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *