కేర‌ళ ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు

Bomb threats received at Kerala CM Office, Secretariat, and Kochi Airport. With 12 bomb threats in the last two weeks, police have initiated searches in the region. Bomb threats received at Kerala CM Office, Secretariat, and Kochi Airport. With 12 bomb threats in the last two weeks, police have initiated searches in the region.

కేర‌ళ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంతో పాటు స‌చివాల‌యానికి నేడు బాంబు బెదిరింపులు అందిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ బెదిరింపుల నేప‌థ్యంలో అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. కొచ్చి ఎయిర్‌పోర్టుకు కూడా ఇదే మాదిరి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ బెదిరింపులపై బాంబ్ స్క్వాడ్, పోలీస్ బృందాలు వివిధ ప్రదేశాలకు చేరుకుని గాలింపు చేపట్టాయి. గత రెండు వారాలుగా కేర‌ళలోని ప్రభుత్వ కార్యాల‌యాల‌కు వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ రావడం అధికారులు తెలిపిన విష‌యమై, మొత్తం 12 బెదిరింపు కాల్స్ నోటిఫై అయ్యాయి.

కేర‌ళ హైకోర్టు, జిల్లా కలెక్టరేట్‌లు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు వంటి ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపుల నేప‌థ్యంలో అధికారులు అప్రమత్త‌మై, త‌నిఖీలు చేప‌ట్టారు.

కాగా, నిన్న తిరువ‌నంతపురం విమానాశ్ర‌యంతో పాటు నగరంలోని పలు ప్రముఖ హోటళ్లకు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే, ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో, వీటిని నకిలీ బెదిరింపులు అని గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *