నటుడిగా ప్రియదర్శి అంచలంచెలుగా ఎదుగుతున్న ప్రస్థానం స్ఫష్టంగా కనిపిస్తుంది. గతంలో హీరో మిత్రబృందంలో కనిపించిన ఆయన, ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం ‘సారంగపాణి జాతకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ప్రియదర్శి ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. కథల ఎంపిక విషయంలో తన స్టైల్‌ను ఈ సందర్భంగా వివరించాడు. “ఒక దర్శకుడు కథతో వస్తే, నేను ప్రేక్షకుడిగా ఆ కథను వింటాను. నచ్చితే వెంటనే ఒప్పుకుంటాను” అని చెప్పాడు.
“ఈ కథను నేను కాకుండా వేరే హీరో చేస్తే, నేను థియేటర్‌కి వెళ్లి చూసేవాడినేనా? అన్న ప్రశ్న వేసుకుంటాను. చూడదగ్గ కథగా అనిపిస్తే మాత్రం ఓకే అంటాను. ‘కోర్ట్’ కూడా అలానే తీసుకున్న సినిమా. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ కూడా అంతే నమ్మకంతో చేశాను” అని తెలిపాడు.
తనలో నెమ్మదిగా పెరిగిన నటనకు ఈ కథలు మంచి స్టేజీగా నిలుస్తాయన్న ఆశ వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు కూడా తన ప్రయత్నాన్ని మెచ్చుకుంటారన్న విశ్వాసంతో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.
