Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeEducation Newsతెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

-

Chat on WhatsApp

తెలంగాణలో 2023-24 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మాల్లు భట్టి విక్రమార్క గారి చేత విడుదలయ్యాయి. ఈ సందర్భములో ఆయన మాట్లాడుతూ, పలు జిల్లాల్లో పరీక్షల నిర్వహణ సాఫీగా సాగిందని తెలిపారు. ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు అని వెల్లడించారు.

ఫస్టియర్ ప‌రీక్ష‌ల‌లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 73.83%, బాలురు 57.83% ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది విద్యార్థులు హాజరయ్యారు, అందులో 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు.

సెకండియ‌ర్ ప‌రీక్ష‌లలో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 74.21%, బాలురు 57.31% ఉత్తీర్ణత సాధించారు. సెకండియ‌ర్ ప‌రీక్షలకు 5,08,582 మంది హాజరయ్యారు, అందులో 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు.

విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://results.cgg.gov.in/ లో చూడవచ్చు. 2023-24 సీజన్‌లో మొత్తం 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Zimbabwe T20 series | హిట్‌మ్యాన్ స్టైల్‌లో హిట్టింగ్.. 15 ఏళ్ల వైభవ్ కొత్త...

Zimbabwe T20 series: "అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తొలి సిరీస్‌లోనే తన ముద్ర వేసిన యువ బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మార్మోగుతోంది..." అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం...
- Advertisement -
Chat on WhatsApp