ప్రేమ, జీవితం, ఆరోగ్యం అన్నీ బీమాతోనే కాపాడుకునే సమాజంలో, ఇప్పుడు ప్రేమ బంధానికి కూడా బీమా ఉండాలని ఒక యువకుడు ఆలోచించాడు. అనుకున్నదే అతను వ్యాపారంగా మార్చేసి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా “రిలేషన్ షిప్ ఇన్సూరెన్స్” పాలసీని ప్రవేశపెట్టాడు. ఈ పాలసీని తీసుకోవాలనుకుంటున్న ప్రేమికులు ఐదు సంవత్సరాలు క్రమంగా ప్రీమియం చెల్లించాలి.
ఈ ఐదు సంవత్సరాల తర్వాత, ఈ జంటలు పెళ్లి చేసుకుంటే చెల్లించిన మొత్తానికి పది రెట్లు ఎక్కువగా తిరిగి పొందగలుగుతారని ఈ యువకుడు ప్రకటించాడు. అంటే, ప్రేమికులు ప్రేమ బంధాన్ని కొనసాగించి పెళ్లి చేసుకుంటే, వారు చెల్లించిన ప్రీమియం మొత్తం లక్షల్లో తిరిగి పొందవచ్చని చెబుతున్నారు.
ఈ ఇన్సూరెన్స్ పథకం కేవలం పెళ్లి చేసుకున్న జంటలకే ప్రయోజనం కలిగిస్తుందని, వివాహం కాకపోతే, మధ్యలో విడిపోయిన జంటలకు రూపాయి కూడా తిరిగి ఇవ్వబడదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం, ప్రేమించిన జంటల్లో పెళ్లి చేసుకునే వారు చాలా తక్కువ మాత్రమే.
ఈ పరిస్థితిని మార్చే లక్ష్యంతో “జికీ లవ్” పేరిట ఈ కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టానని అతను తెలిపాడు. ఈ పథకం ద్వారా ప్రేమికులు తమ ప్రేమను పెళ్లికి దారి తీసేందుకు ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నారు.