వైల్డ్‌గా అలరించనున్న నాని హిట్-3 ట్రైలర్ విడుదల!

The trailer of HIT-3 is out, with Nani playing a powerful cop. Fans are hyped as the film promises intense action and mystery in the HIT Universe.

నేచుర‌ల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో శైల‌ష్ కొల‌ను దర్శకత్వంలో రూపొందిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‘హిట్‌-3’ మే 1న విడుదల కానుంది. ‘హిట్’ యూనివర్స్‌లో ఇది మూడవ చిత్రం కావడంతో ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. గతంలో వచ్చిన హిట్ 1, హిట్ 2 చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే వరుస హత్యల కేసులు… వాటిని ఛేదించే పవర్‌ఫుల్ పోలీస్ అధికారి అర్జున్ సర్కార్ పాత్రలో నాని అదరగొడతాడనిపిస్తోంది. డైలాగ్స్, నేపథ్య సంగీతం, విజువల్స్—all together హిట్-3ని ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా నిలబెడతాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

నాని ఈ సినిమాలో అగ్రెసివ్ లుక్‌లో కనిపించగా, ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్‌లో గూస్‌బంప్స్ ఇస్తాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. హిట్ 1, 2 చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మరింత వైల్డ్‌గా, మిస్టీరియస్‌గా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అర్జున్ సర్కార్ కేసును ఎలా ఛేదించాడన్న ఆసక్తి భారీగా పెరిగింది.

ఈ చిత్రంలో నానికి జోడిగా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కనిపించనుండగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నాని నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమాస్‌తో పాటు యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *