సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ లో నెల్లూరుకు రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవం జరిగింది. ఈ బస్సులను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, ఇటీవల రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిసినప్పుడు సూళ్లూరుపేటలో ప్రయాణికుల ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు. త్వరలోనే బెంగళూరు, తిరుపతి రూట్లకు కూడా కొత్త బస్సులు ఏర్పాటు చేయాలన్న సూచనకు మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
పాఠశాల పిల్లల రవాణా సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఆమె తెలిపారు. త్వరలోనే స్కూల్ బస్సుల కోసం అనుమతులు తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, మండల అధ్యక్షుడు పెమ్మసాని శ్రీనివాసులు నాయుడు, పార్టీ నేతలు కొక్కు శంకరయ్య, ఏజీ కిషోర్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. బస్సుల ప్రారంభం స్థానికంగా ఉత్సాహాన్ని కలిగించింది.