గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, డా. చింతలపూడి అశోక్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న పార్టీ అని, నవరత్నాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మార్గం చూపిందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, ప్రజల విశ్వాసం కలిగించిన పార్టీగా నిలిచిందని తెలిపారు.
వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో సాగిన వేడుకల్లో నాయకులు పార్టీ సిద్ధాంతాలను వివరించి, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్సార్సీపీ నాయకత్వంపై ప్రజల్లో అచంచలమైన నమ్మకం ఉందని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలంగా ముందుకు సాగాలని కార్యకర్తలు సంకల్పం చేశారు.