జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14న పిఠాపురం, చిత్రాడలో భారీ బహిరంగ సభగా నిర్వహించనున్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి హిందూపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ విజయవంతం చేయడానికి ప్రత్యేకంగా బస్సులు, జీపులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పెద్ద ఎత్తున జనసేన అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివస్తారని పేర్కొన్నారు.
సభకు హాజరయ్యే వారికి వసతి, భోజన సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచామని జనసేన నాయకులు తెలిపారు. కాకినాడలో ప్రత్యేకంగా కాపు కళ్యాణ మండపంలో వసతి కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పార్టీ నాయకుల సమన్వయంతో కార్యకర్తలు సమిష్టిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, పెనుగొండ నాయకులు కుమార్, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు అడ్డగిరి శ్యామ్ కుమార్, మల్లెమీద మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం భారీ ఎత్తున జరపాలని నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి భరోసా ఇచ్చారు.