సూడాన్‌లోని ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్‌లో మంగళవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం అదుపుతప్పి కుప్పకూలింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పైలట్ సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. గాయపడిన ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో విమానంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. విమానం శిధిలాలను పరిశీలించి మరిన్ని వివరాలను అందించనున్నట్లు చెప్పారు.
ఈ ఘటనలో ప్రాణనష్టం అధికంగా ఉండటంతో సూడాన్ అధికారులు విచారణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అధికార వర్గాలు వెల్లడించాయి.