పుష్ప-2 – భారీ వసూళ్లతో శాటిలైట్ రికార్డులు

Pushpa-2 movie has set new records at the box office with massive collections. It has grossed ₹1,871 crore worldwide. Pushpa-2 movie has set new records at the box office with massive collections. It has grossed ₹1,871 crore worldwide.

అల్లు అర్జున్, ర‌ష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప-2 ది రూల్ సినిమా, భారీ వసూళ్లను సాధించి బాక్సాఫీస్‌ను బోల్తా కొట్టించింది. 2022 డిసెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు రూ. 1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ ఘనత సాధించిన సందర్భంగా మేకర్స్ ఈ సినిమా కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించి ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.

పుష్ప-2 సినిమా విడుదలైన మొదటి రోజే రూ. 294 కోట్ల గ్రాస్ వసూలు చేసి, మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత, ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి మరొక కొత్త మైలురాయిని చేరుకుంది. ఆరు రోజుల్లోనే ₹1000 కోట్లు సొంతం చేసుకొని సంచలనం రేపింది.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన మరియు రష్మిక మందన్నా యాక్టింగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఆయన సంగీతం పుష్ప-2 చిత్రాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది.

ప్ర‌స్తుతం పుష్ప-2 సినిమా కొన్ని థియేటర్లలో ప్రదర్శనగా ఉంది. అలాగే, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. పుష్ప-2 ప్ర‌పంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ పొందిన ఈ సినిమా మరో స్థాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *