జోగులాంబ గద్వాల జిల్లా వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చిన స్పోర్ట్స్ పార్టీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ కు ఎర్రవల్లి చౌరస్తాలో ఘనస్వాగతం లభించింది. బాస్ శ్యామల హనుమంతు నాయుడు ఆహ్వానం మేరకు ఆయన వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి చౌరస్తా సర్పంచ్ అభ్యర్థి పల్లె రాజు మర్యాదపూర్వకంగా పూలమాలతో స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, తేనేటి విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ స్థానిక సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ, ప్రజల్లో ఉండాలని నాయకులకు సూచించారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలని పల్లె రాజు, ఇతర నాయకులకు సూచనలు ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి అనుకూలంగా పనిచేయాలని కోరారు.
అనంతరం గద్వాల జిల్లాలో వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ ప్రజలతో మమేకమై, వారి అభిప్రాయాలను స్వీకరించారు. వివాహ కార్యక్రమంలో అతిథిగా హాజరైన ఆయనకు గ్రామస్థులు ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్.ఎస్. కిషోర్, జోగులాంబ టెంపుల్ మాజీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్, ట్రాక్టర్ షోరూమ్ ఆంజనేయులు, బీచుపల్లి అంజి ముదిరాజ్, ఎర్రవల్లి గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఉత్సాహాన్ని రేకెత్తించింది.