నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్.సి.ఏ.పి) కార్యక్రమంలో భాగంగా, నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మద్రాస్ ఐఐటీ విద్యార్థులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నేతృత్వం వహించింది.
కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు అవసరమైన రోడ్ డస్ట్ కలెక్టర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వంటి పరికరాల పనితీరును పరిశీలించామని, వాటిని త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే, స్వచ్ఛమైన వాయువును వాతావరణంలో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
మురుగునీటి శుద్ధి కేంద్రాల వద్ద హానికరమైన వాయువుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. నగరంలోని పొల్యూషన్ లెవల్స్ తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు త్వరలో అమలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్.ఇ రామ్మోహన్ రావు, రక్షా గ్రీన్ సొల్యూషన్ చంద్రమౌళి, ఈ.ఈ.లు రహంతు జానీ, శేషగిరి రావు, శ్రీనివాసరావు, డాక్టర్ ఎజాహిల్, ఎన్.కాప్ ప్రతినిధులు, ఐఐటీ మద్రాస్ విద్యార్థులు పాల్గొన్నారు.