వచ్చే ఉగాది నుంచి పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టి, ప్రతి కార్యకర్తను కలిసిపార్వీ బలోపేతానికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మాజీ ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ అభివృద్ధిని పరిశీలించి, అందరి అభిప్రాయాలను వినడం ప్రధాన లక్ష్యమని అన్నారు.
సీతానగరం మండలంలో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైయస్సార్సీపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల వద్దకు వెళ్లి పార్టీ వైఫల్యాలను అర్థం చేసుకుని, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ఈ పల్లెబాట కార్యక్రమం ఉండాలని తెలిపారు.
పార్టీ ఓటమి అనంతరం చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, కానీ కార్యకర్తల ఐక్యతే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని జోగారావు పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల మధ్య ఒకతత్వాన్ని కొనసాగిస్తూ, గ్రామాలలో తిరిగి జనాదరణను పెంచుకునేలా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిలిపే విధంగా ఉగాది తర్వాత పల్లెబాట కార్యక్రమాన్ని కార్యాచరణ రూపంలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.