అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన టేబుల్ పై ప్రత్యేక బటన్ ఏర్పాటు చేయించుకున్నారు. ఈ బటన్ నొక్కగానే సిబ్బంది వెంటనే ఆయనకు డైట్ కోక్ అందించాల్సి ఉంటుంది. ట్రంప్ రోజుకు పది నుంచి పన్నెండు వరకు డైట్ కోక్ తాగుతారని, అందుకే ఈ ప్రత్యేక బటన్ ఏర్పాటు చేయించుకున్నారని న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది.
ఈ బటన్ నొక్కిన వెంటనే ట్రంప్ సిబ్బంది గదిలో ప్రత్యేకమైన సంకేతం మోగుతుంది. దీంతో వారు వెంటనే ఓ డైట్ కోక్ తీసుకెళ్లి ట్రంప్ కు అందిస్తారు. ప్రతిసారీ కోక్ కావాలని పిలిచి చెప్పాల్సిన అవసరం లేకుండా, ఈ ప్రత్యేక బటన్ ద్వారా తమ సిబ్బందిని హెచ్చరించేలా ఏర్పాటు చేసుకున్నారు.
2021లో జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బటన్ ను ఓవల్ ఆఫీసు నుంచి తొలగించారు. బైడెన్ తన పాలనలో దీని అవసరం లేదని భావించి, ట్రంప్ ఉపయోగించిన ఈ ప్రత్యేక బటన్ ను పూర్తిగా తొలగించినట్టు సమాచారం.
అయితే, 2025లో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఈ బటన్ మరోసారి టేబుల్ పై ప్రత్యక్షమైంది. ట్రంప్ తన పాత అలవాట్లను కొనసాగిస్తూ ఈ ప్రత్యేక డైట్ కోక్ బటన్ ను తిరిగి అమర్చించుకోవడం ఆసక్తిగా మారింది.