Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeInterNationalSwitzerland Tariffs | స్విట్జర్లాండ్‌కు ట్రంప్ టారిఫ్ దెబ్బ...ఆమె తీరు నచ్చలేదు

Switzerland Tariffs | స్విట్జర్లాండ్‌కు ట్రంప్ టారిఫ్ దెబ్బ…ఆమె తీరు నచ్చలేదు

-

Chat on WhatsApp

Switzerland Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. స్విట్జర్లాండ్‌పై టారిఫ్‌లు పెంచడానికి ఆ దేశ నేత మాట్లాడిన తీరు కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

స్విట్జర్లాండ్‌పై తొలుత 30 శాతం సుంకాలు విధించామని, అవి కూడా తక్కువేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. టారిఫ్‌లు ప్రకటించిన తర్వాత స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరిన్ కెల్లర్ సట్టర్ నుంచి తనకు ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని తెలిపారు. అయితే ఆ కాల్‌లో ఆమె మాట్లాడిన విధానం తనకు నచ్చలేదని అన్నారు.

‘‘మాది చాలా చిన్న దేశం. ఈ టారిఫ్‌లను మేం భరించలేం’’ అంటూ ఆమె పదేపదే చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న దేశమే అయినా అమెరికాతో 42 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉందని గుర్తుచేశానని తెలిపారు.

అయినప్పటికీ అదే వాదన కొనసాగించడంతో, సుంకాలు తగ్గించాల్సింది పోయి 30 శాతం నుంచి 39 శాతానికి పెంచానని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇదే అంశంపై దావోస్ వేదికగా కూడా ట్రంప్ గతంలో స్విట్జర్లాండ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp