కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల కోసం శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర్ రెడ్డి పిలుపుమేరకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఇతర నేతలు పాల్గొని స్వామి రథోత్సవాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
