వేటపాలెం మండల పరిధిలోని పందలపల్లి గ్రామంలో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ మరియు వార్త దినపత్రిక సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. చెరుకూరి రాంబాబు మరియు చెరుకూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శిబిరం విజయవంతంగా నిర్వహించారు.
వేటపాలెం మండల తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ పల్లపులు శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరింత విస్తరించి మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందించడం ఎంతో ప్రశంసనీయం అని తెలిపారు.
ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్ష, ఈసీజీ, బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. గుండె, కిడ్నీ పేషెంట్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరియు వైద్య సూచనలు ఇవ్వడం జరిగాయి. దాదాపు 300 మంది ప్రజలు చికిత్స పొందారు.
రోగ నిర్ధారణ అయిన 80 మంది పేషెంట్లకు ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈ ఎస్ ఐ, ఈ హెచ్ ఎస్, రైల్వే, ఎఫ్ సి ఐ కార్డుల ద్వారా ఉచిత ఆపరేషన్లు నిర్వహించబడ్డాయి. కిమ్స్ హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ రఫీ చెప్పారు, “ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తాం.”