కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయుడు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రకాష్ అధ్యక్షుడిగా, దాసరి శ్రీనివాస్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా శీలి లక్ష్మణరావు, సాగర్ నానీ, జాయింట్ కార్యదర్శిగా వి. రవికుమార్, కోశాధికారిగా సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తమపై నమ్మకంతో ఈ పదవి కల్పించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అనంతరం నూతన కమిటీ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు అందజేశారు.
నానాజీ నూతన కమిటీని అభినందిస్తూ, కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం సహకారం అందిస్తానని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్తిబాబును, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును కలుసుకుని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు సుధీర్, నానాజీ, ప్రకాష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కమిటీ రూరల్ ప్రెస్ క్లబ్‌కు మరింత శోభను తెస్తుందని ఆశిస్తున్నారు.