Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeFilms Newsగేమ్ చేంజర్ కటౌట్ ఆవిష్కరణ విజయవాడలో గ్రాండ్ ఈవెంట్

గేమ్ చేంజర్ కటౌట్ ఆవిష్కరణ విజయవాడలో గ్రాండ్ ఈవెంట్

-

Chat on WhatsApp

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్ర ప్రమోషన్స్ వేగం పెంచాయి. జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమా మేనియా ఇప్పటికే ప్రేక్షకులను ఊరించేస్తోంది. డిసెంబరు 29న, విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ వద్ద భారతదేశంలోనే అతి పెద్ద రామ్ చరణ్ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగనుంది.

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా రూపొందిన గేమ్ చేంజర్, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్ట్ భారీ హైప్ క్రియేట్ చేసింది. తమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మేకర్స్ ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఉన్నాయని, ప్రేక్షకులకు ఎలాంటి నిరాశ కలిగించకుండా పెద్ద హిట్ ఇచ్చే నమ్మకంతో ఉన్నారని వెల్లడించారు. శంకర్ గత సినిమాల ట్రాక్ రికార్డును చూస్తే గేమ్ చేంజర్ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో, కటౌట్ ఆవిష్కరణ ఈవెంట్ ద్వారా రామ్ చరణ్ అభిమానులకు పండగ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. ఈ గ్రాండ్ ప్రోగ్రామ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో కీలక మైలురాయిగా నిలుస్తుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

central government clarifies on e25 ethanol blended petrol rollout in india

E25 petrol | E20 తర్వాత E25 వస్తుందా?.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది

E25 petrol: దేశవ్యాప్తంగా 25 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్(E25 petrol)ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం ఈ25 పెట్రోల్‌ను అమల్లోకి తీసుకురావాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని...
- Advertisement -
Chat on WhatsApp