తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులపై చర్చ

Telangana Assembly to discuss key bills like Bhoobharati, Municipality Amendments, and Panchayat Raj reforms. Focus on farmers' welfare and government debt issues. Telangana Assembly to discuss key bills like Bhoobharati, Municipality Amendments, and Panchayat Raj reforms. Focus on farmers' welfare and government debt issues.

డిసెంబర్ 19న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగాయి. ఈ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి, అయితే ఈ సమావేశంలో 3 కీలక ప్రభుత్వ బిల్లులకు ఆమోదముద్ర వేసినట్లు ప్రకటించబడ్డాయి.

ఈ రోజు ప్రారంభం కానున్న సభలో భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ బిల్, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది.

ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై కూడా చర్చ జరగనుంది. దీంతో పాటు, ఈ సంక్రాంతి నుంచి ప్రారంభమయ్యే రైతు భరోసా పథకంపై కూడా సభలో చర్చ జరగనుంది.

ఈ కీలకమైన చర్చలకు ముందుగానే, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకోనున్నారు. సభలో భూభారతి, రైతు భరోసా అంశాలపై చర్చ జరుగుతుండగా, సీఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *