9 క్యారెట్ల బంగారంఫై కేంద్రం కీలక నిర్ణయం

బంగారం ధరలు పెరిగి, చోరీలు కూడా అధికం. 9 క్యారెట్ల బంగారం ప్రవేశానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 10 గ్రాముల ధర రూ. 20K-30K. 9 క్యారెట్ల బంగారంఫై కేంద్రం కీలక నిర్ణయం

ప్రస్తుతం బంగారం ధరలు రూ. 70 వేలకు అటూఇటుగా కొనసాగుతున్నాయి. దీంతో అటువైపు చూడాలంటేనే మగువలు భయపడుతున్నారు. అంతేకాదు, బంగారం చోరీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో, నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. 

దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై 9 కేరెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం పెరిగాయి. దీంతో నగలు వేసుకుని దొంగలకు ముట్టజెప్పడం దేనికన్న ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిసింది. 9 కేరెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారంపైనా దాని నాణ్యతలను ధ్రువీకరించే హాల్‌మార్క్ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *