రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు రూ.7 లక్షల విలువ గల మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన ఘటన జరిగింది. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే, బాలాపూర్ పోలీసులు వారి ఫోన్లను ట్రాక్ చేసి వారికి తిరిగి అందజేశారు.
సీఐర్ పోర్టల్ ద్వారా ఫోన్లు ట్రాక్ చేయడం వల్ల అనేకమంది తమ ఖరీదైన మొబైల్ ఫోన్లను తిరిగి పొందగలిగారు. బాలాపూర్ పోలీసులు ఫిర్యాదు వచ్చిన వెంటనే దర్యాప్తు చేపట్టి, బాధితుల ఫోన్లు తిరిగి అప్పగించడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల స్పందన వేగంగా ఉండటంతో బాధితులు పోలీసు సేవలను ప్రశంసించారు.
బాలాపూర్ పోలీస్ స్టేషన్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు సేవ చేయడంలో ముందంజలో ఉండాలని కే.సీఐ సుధాకర్ తెలిపారు. ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందని, ఫోన్ రికవరీ చర్యలు భవిష్యత్తులో మరింత మెరుగుపరచాలని ఆయన తెలిపారు.
ఈ ఘటనపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ ఫోన్లను తిరిగి అందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బాలాపూర్ పోలీసులు చూపిన చొరవ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
