చెన్నూర్ మున్సిపాలిటీ లోని 4 వ వార్డులో 62.90 లక్షల డీ ఎం ఎఫ్ టీ నిధులతో వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు…
చెన్నూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నూర్ లో అన్ని వార్డులలో డ్రైనేజీ బాగాలేదు రోడ్ లు బాగా లేవు అని ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.
చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు నాకు సహకరించాలి. అని కోరారు. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు లో అనేక అవకతవకలు జరిగాయి.
కేసీఆర్ ఇంటింటికి నళ్లా నీళ్ళు ఇవ్వకుంటే ఎలక్షన్ కి రాను అని అన్నాడు
కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చెన్నూర్ రైతులు నష్టపోయారు.
మంత్రి గారితో మాట్లాడి ఇక్కడ రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరాను.
పంట నష్టం పైన కలెక్టర్ గారితో సర్వే చేయామని ఆదేశాలు ఇచ్చాను.సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరాను
కాంగ్రెస్ ప్రజా పాలనలో ఎవ్వరూ నష్టపోకుండా చూస్తాము.
చెన్నూర్ ప్రాంతాన్ని అమృత్ స్కీం ద్వారా 30 కోట్లతో పనులు ప్రారంభించాము…
చెన్నూర్ ప్రాంతంలో ఫారెస్ట్ ప్రాంతంలో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని పర్మిషన్స్ రావడానికి లేట్ అవుతుంది కానీ త్వరలోనే అధికారులతో మాట్లాడి మిగతా పనులకు పూర్తి చేస్తానని చెప్పారు.
బీఆర్ఎస్ నాయకులు మా పై సోషల్ మీడియాలో ఏమి అభివృద్ధి చేయట్లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
10 సంవత్సరాలు మీరు ఎం చేసారు అని నేను ప్రశ్నిస్తున్నాను..
100 కోట్లతో జోడు వాగులు రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసాము.20 లక్షల రూపాయలతో 20 లక్షల రూపాయలు కేటాయించాము.. అని పేర్కొన్నారు.
శనిగకుంట చెరువు ఘటనలో సరైన నిందితులను పట్టుకోవాలి అని అధికారులను ఆదేశించారు.
చెన్నూర్ లో సాండ్ మాఫీయా, పేకాట జరిగితే సహించేది లేదు.
నేను ఇక్కడ పని చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను , అభివృద్ధి చేసి పెడతా అని అన్నారు.
అంబేద్కర్ భవన్ కు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసాను.అన్ని వర్గాల వారికి పనులు సక్రమంగా చేయడానికి ప్రణాలికలు రూపొందించాను.
100 పడకల ఆసుపత్రిని తొందరగా మంజూరు చేయాలని మంత్రి గారిని కోరాము
మందమర్రి లో కూడా ఒక ఆసుపత్రి కావాలని మంత్రి గారికి వినతి చేసాము,
అన్ని పనులు తొందర్లోనే పూర్తి చేస్తాము..అని స్థానిక ఎమ్మెల్యే వివేక్ అన్నారు.