400 IndiGo flights | ఇండిగో షాక్ ఒక్కరోజులో 400కి పైగా విమానాలు రద్దు 

IndiGo aircraft parked at airport after large scale flight cancellations in India IndiGo aircraft parked at airport after large scale flight cancellations in India

IndiGo Shock: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్‌లు (indigo flight airlines)భారీ స్థాయిలో విమానాలను రద్దు చేయడం ప్రయాణికుల్లో ఆందోళనకు దారితీసింది. సాంకేతిక లోపాలు, సాంకేతికలోపల కారణంగా శుక్రవారం ఒక్కరోజే 400కిపైగా విమానాలు(400 indigo flights) రద్దు చేసినట్లు సమాచారం.

దీని వలన చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో నిలిచిపోగా, టెర్మినళ్ల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది.

ALSO READ:TG Govt Jobs 2026 | రాబోయే ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు లక్ష్యం


ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 53, రానున్న 51 విమానాలు సహా 104 విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో మొత్తం 102 విమానాలు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 92 విమానాలు రద్దు చేయబడ్డాయి. అంతేకాదు పూణే విమానాశ్రయంలో అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు 32 విమానాలు నిలిచిపోయాయి.

ఈ పరిణామంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఇండిగోలో ఏర్పడిన గందరగోళం ప్రభుత్వ మోనోపోలీ విధానాల ఫలితం అని పేర్కొంటూ ఆలస్యం, రద్దుల వల్ల నష్టపోయేది సాధారణ ప్రజలేనని వ్యాఖ్యానించారు. భారత్‌కు న్యాయమైన పోటీతత్వం అవసరమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *