ఎమ్మిగనూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నాలుగు నూతన ఎక్స్‌ప్రెస్ బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి, జండా ఊపి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బళ్ళారి, బెంగళూరు మార్గాల్లో ఈ బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు.
తొలివిడతగా ఈ నాలుగు బస్సులతో ప్రారంభించినప్పటికీ, త్వరలోనే 15 పల్లెవెలుగు బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రణాళిక ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో బస్సుల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, తన పాలనలో ఇది ఐదవ విడతగా కొత్త బస్సులు చేరినట్లు తెలిపారు.
ఎమ్మిగనూరు డిపోకు మొత్తం 12 ఎక్స్‌ప్రెస్ బస్సులను కేటాయించామని, అందులో 4 బస్సులు శ్రీశైలం, 4 బెంగళూరు, 4 బళ్ళారి సర్వీసుల కోసం ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌కు ఒక సూపర్ లగ్జరీ బస్సు కూడా నడిపిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాలకు మరింత సౌకర్యంగా బస్సు సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు.