కరీంనగర్:శాతవాహన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఘనంగా రెండో స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ “జిష్ణుదేవ్ వర్మ” ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులను అభినందించారు. ఆయనతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ “బీజే రావు”కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ స్నాతకోత్సవ వేడుకలో వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు “161 గోల్డ్ మెడల్స్”, “20 పైగా డాక్టరేట్ పట్టాలు” అందజేశారు. గవర్నర్ విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ, ఉన్నత విద్యను సమాజ సేవకు ఉపయోగించాలన్నారు.
ALSO READ:పాకిస్తాన్ అణు చరిత్రపై విదేశాంగ శాఖ వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ “ఉమేష్ కుమార్”, అధ్యాపకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు.
