మహబూబాబాద్ జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు కిసాన్ పరివార్ సేవా సంస్థ సహాయం అందజేసింది. శనివారం చెక్కుల రూపంలో ఆర్థిక సాయం అందించారు.
మరిపెడ మండలంలోని ఏ డ్చర్ల గ్రామ దళితవాడలో త్రాగునీటి సమస్యను గమనించి, కిసాన్ పరివార్ సంస్థ రెండు బోర్లను సాంక్షన్ చేసి వెంటనే వేయించారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసి, తమ సంస్థ సేవలను వివరించారు. సహాయం 20 లక్షల రూపాయల విలువ గలదని తెలిపారు.
నెల్లికుదురు మండలం రావిరాల, డోర్నకల్ మండలం దుబ్బ తండాల బాధితులకు చెక్కులతో పాటు నిత్యవసర వస్తువులు, బట్టలు కూడా అందించారు.
కిసాన్ పరివార్ చైర్మన్ భూపాల్ నాయక్ ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, విపత్తు బాధితులకు సహాయం చేయడం సంస్థ ధ్యేయమని చెప్పారు.
డాక్టర్ వివేక్ మాట్లాడుతూ, వరదలు అనేక ప్రాంతాల్లో నష్టం కలిగించాయని, తమ సంస్థ బాధితులకు సహాయం అందించడంలో తృప్తి పొందుతోందని పేర్కొన్నారు.
తమ సంస్థ ద్వారా చెక్కుల రూపంలో మాత్రమే కాకుండా, నిత్యావసర వస్తువుల ద్వారా కూడా బాధితులకు సహాయం అందిస్తున్నామని తెలిపారు.
బాధిత కుటుంబాలు ఈ సహాయ సహకారాలతో కొంతవరకు ఉపశమనం పొందాయని, తమ సంస్థ సేవలు నిరంతరం కొనసాగుతాయని కిసాన్ పరివార్ సభ్యులు తెలిపారు.