మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ సోమవారం నాడు రేగిడి మండలంలో పర్యటించారు*
ముందుగా సంకిలి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు*
అనంతరం లోతట్టు ప్రాంతమయిన రేగిడి గ్రామంకు వెళ్లి సాయన్న గెడ్డ వరద ఉద్రితితో నీటమునిగిన పంటను అలాగే జలదిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,అంగన్వాడీ, పశు వైద్య కేంద్రాన్ని ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు*
మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు.నీట మునిగిన పంటనష్టంను అధికారులు నివేదికను త్వరితగతిన అందజేయాలన్నారు
పంటనష్ట పరిహారం నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.*
ముంపునకు గురవుతున్న రేగిడి గ్రామంలో కరకట్టల నిర్మాణంపై సీఎం దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో రేగిడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.