రిషబ్ శెట్టి బాలీవుడ్‌పై కామెంట్స్‌: అభిమానుల్లో ఆగ్రహం

Rishab Shetty says he always wanted to be an actor, reveals why he got into  direction - India Today

కన్నడ న‌టుడు, కాంతార ఫేమ్ రిషబ్‌ శెట్టి తాజాగా బాలీవుడ్‌పై వివాదాస్పద కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలిచారు. బాలీవుడ్ సినిమాలు భార‌త్‌ను చెడుగా చూపిస్తుంటాయ‌ని అన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందని తెలిపారు. తాను దేశం గర్వపడేలా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆయ‌న విమ‌ర్శ‌ల ప‌ట్ల బాలీవుడ్ అభిమానులు మండిప‌డుతున్నారు. 

కొందరు రిష‌బ్ షెట్టిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో ఆయ‌న‌ నటించిన కొన్ని సినిమాల్లోని సీన్ల‌ను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా, ఇటీవ‌ల ప్ర‌క‌టించిన జాతీయ సినిమా అవార్డుల్లో కాంతార మూవీకి గాను రిష‌బ్ శెట్టి జాతీయ‌ ఉత్త‌మ న‌టుడిగా ఎంపికైన విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *