తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు, క్రీడా పోటీలలో సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పలువురు పోలీస్ సిబ్బంది మెడల్స్ సాధించారు. పోలీస్ కమీషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్, విజేతలను అభినందించారు. కరాటేలో స్వర్ణం, పవర్ లిఫ్టింగ్‌లో రజతం, బాడీ బిల్డింగ్‌లో రజతం, టెన్నిస్‌లో కాంస్య పతకాలు సాధించడం గర్వించదగిన విషయం అన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ అనురాధ మాట్లాడుతూ, విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్రీడా పోటీలలో మెడల్స్ సాధించడం ప్రశంసనీయమని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచి, ఇంకా ఎక్కువ మెడల్స్ సాధించాలని అధికారులకు, సిబ్బందికి అభిలాషించారు.
కరీంనగర్‌లో జరుగుతున్న తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ తరఫున రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ విశ్ణు ప్రసాద్, రాజేశ్ లాన్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం గెలిచారు. రాజేశ్ టెన్నిస్ ఓపెన్ డబుల్స్‌లో కూడా కాంస్య పతకం సాధించారు. రోహిత్ (ఆర్‌ఎస్‌ఐ) పవర్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించారు.
అలాగే, ప్రసాద్ (ఏఆర్ కానిస్టేబుల్) కరాటేలో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. లక్ష్మణ్ (ఏఆర్ కానిస్టేబుల్) బాడీ బిల్డింగ్‌లో రజతం సాధించారు. ఖో ఖో క్రీడలో ఏఆర్ కానిస్టేబుళ్లు బి. రాకేష్, కె. శ్రీకాంత్, షేక్ బాబా, సివిల్ కానిస్టేబుల్ డి. లింగం కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. విజేతలను అభినందించేందుకు ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ కిరణ్, స్టేట్ పోలీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి హాజరయ్యారు.