భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2025లో భాగంగా సింగరేణి ఓసి-2లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. రవాణాశాఖ అధికారి సంధాని మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలకు మానవ తప్పిదాలు, ముఖ్యంగా రోడ్డు నియమాల ఉల్లంఘనే కారణమని, ఓవర్ స్పీడ్, ఓవర్ టేకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకపోవడం ప్రధాన కారణాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో OC-2 మేనేజర్ కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సుందర్ లాల్, శ్రీనివాస్, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

