మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 45 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, మున్సిపల్ కమిషనర్ సరస్వతి పాల్గొన్నారు.

