పెదనందిపాడు BC-3 కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాల సందర్భంగా గర్భిణీ, బాలింతలకు పోషక విలువలపై అవగాహన కల్పించారు.
1000 రోజుల్లో ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, ఫ్రూట్స్ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో వివరించారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డను వ్యాధుల నుంచి కాపాడడమే కాకుండా తల్లికి బ్రెస్ట్ క్వేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని వివరించారు.
అంగన్వాడీ సెంటర్‌లో అందించే బాలసంజీవని కిట్ వినియోగించడం రక్తహీనత నివారణకు కీలకం అని చెప్పారు.
ఫోర్టిఫైడ్ రైస్‌లో ఉన్న ఐరన్, కాల్షియం వలన గర్భిణీ, బాలింతలకు ఉన్న ఉపయోగాలను అంగన్వాడీ సిబ్బంది వివరించారు.
ఐసీడీఎస్ సూపర్వైజర్ వై. రాజ్యలక్ష్మి బిడ్డ బరువు, ఎత్తు వంటి ఆరోగ్య పరిమాణాలను గ్రోత్ ఛార్ట్ ద్వారా క్రమంగా పరిశీలించమని సూచించారు.
గర్భిణీలు, బాలింతలు ద్రవ్యపానీయాలు, పోషకాహారాన్ని సక్రమంగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.