పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Winter Session) షెడ్యూల్ ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమై 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) శనివారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ALSO READ:మా ఇల్లు పింఛన్ కాలిపోయాయి వృద్ధ దంపతుల ఆవేదన
ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేస్తూ, “డిసెంబర్ 1 నుండి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు” అని పేర్కొన్నారు.
ఇక ఈ సమావేశాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలతో పాటు పలు కీలక బిల్లులపై చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ సమావేశాల అజెండాపై వ్యూహరచన ప్రారంభించనుంది.
ఈ సారి శీతాకాల సమావేశాలు సాధారణ ఎన్నికల ముందు జరగబోతుండటంతో రాజకీయంగా కూడా ఇవి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
